తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ సిట్టింగ్ ఎంపీ
కల్వకుంట్ల కవిత బరిలోకి దిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో
మాట్లాడుతూ”స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా పని చేసినవాళ్లు ఓడిపోయారు.
కానీ నిజామాబాద్ లో కవిత ఓటమిని కొంతమంది పెద్దగా చేసి చూపిస్తున్నారు. ప్రధానులుగా కావాలని.. దేశాన్ని ఏలాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ,మాజీ ప్రధాని దేవెగౌడ్ ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహాజం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి ఓడిపోయిన సందర్భం ఉంది. కానీ ఆ తర్వాత కేసీఆర్ కు ఎదురులేదు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ .
ఓటమితో కుంగిపోయేది లేదు. కవిత ఓటమి కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేశాయి”అని ఆయన అన్నారు. జగిత్యాలలోని ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత ఇంట్లో రైతుల పేరిట మొత్తం తొంబై మూడు నామినేషన్లు వేయించారు. కవిత ఓటమికి రైతులు అసలు కారణం కాదు. ఆయా పార్టీలకు చెందిన రాజకీయ కార్యకర్తలే”అని ఎంపీ కవిత ఓటమి వెనుక ఉన్న అసలు కారణం బయట పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు వల్లే కవిత ఓడారు. నేను, కవిత ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నాం. ఒక చిన్న ఓటమితో కుంగిపోయేవాళ్లం కాదు అని కేటీఆర్ అన్నారు..