Home / 18+ / దేశంలోని ముఖ్యమంత్రుల్లో చాలామంది యువ నాయకులే.. వారిలో జగన్.. ఎవరి వయసెంతో తెలుసా.?

దేశంలోని ముఖ్యమంత్రుల్లో చాలామంది యువ నాయకులే.. వారిలో జగన్.. ఎవరి వయసెంతో తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దేశంలో అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ కూడా ఒకరు. వయసు బట్టి చూస్తే జగన్ 5వ స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమాఖండు అతిచిన్న వయసున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయన ఏజ్ 39 ఏళ్లు, రెండోస్థానంలో మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా.. ఈయన వయస్సు 41సంవత్సరాలు. మూడోస్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ న్నారు. ఈయనది 46 సంవత్సరాలు. అలాగే నాలుగో ప్లేస్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఐదో ప్లేస్ లో ఏపీ సీఎం జగన్ ఉన్నారు.

ప్రస్తుతం జగన్ వయస్సు 46 సంవత్సరాలు. జగన్ తర్వాత త్రిపుర సీఎంగా ఉన్న బిప్లవ్ దేబ్ ఆరోస్థానంలో ఉన్నారు. ఈయన ఏజ్ 47 సంవత్సరాలు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏడోస్థానంలో నిలిచారు. ఎనిమిదవ స్థానంలో 50 ఏళ్లు గల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్నారు. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తొమ్మిదో స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జైరామ్ ఠాకూర్ పదోస్థానంలో నిలిచారు. ఈ క్రమంలో చూస్తే భారత దేశంలోని పది రాష్ట్రాలకు 54 ఏళ్ల లోపు ఉన్నవారే సీఎంగా ఉన్నారు. ఐదవ స్థానంలో జగన్ నిలిచారు.