తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ సీజన్లో రైతాంగానికి రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. ఇందుకు సంబంధించిన రూ.6900కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ రోజు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈఏడాది నుంచి ఒక ఎకరానికి రూ పదివేల చొప్పున రైతుబంధు పథకం అమలు కానున్న సంగతి విదితమే. ఖరీఫ్ ,రబీ పంటలకు ఎకరాకు రూ.5000చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది టీఆర్ఎస్ సర్కారు.
