ఇటీవల విడుదలైన చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు.
ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ షెడ్యూల్‌లో సమంతతో పాటు చిత్రం ప్రధాన పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించారు.
తాజాగా పోర్చుగల్‌లోనే షూటింగ్ జరుగుతుండగా, మహానటి చిత్రంతో అలరించిన కీర్తి సురేష్ టీంతో జాయిన్ అయింది. వీరిద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. చిత్ర దర్శకుడు షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్ అయింది. వెన్నెల కిషోర్ చిత్రంలో కమెడీయన్‌గా అలరించనున్నాడు అని సమాచారం.