తెలంగాణ రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతం అయిన సిద్దిపేట కోమటి చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరం లో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువు పై వేలాడే వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కోమటి చెరువు పై ఇటీవలే జిప్ సైక్లింగ్, ఇతర సాహస క్రీడలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నామని, మరికొద్ది రోజుల్లోనే కోమటి చెరువు కి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాబోతున్నాయన్నారు. కోమటి చెరువు ని మరింత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విదంగా, సిద్దిపేట ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా లక్నవరం తరహారలో వ్రేలాడే వంతెనను నిర్మిస్తున్నామన్నారు.
కోమటి చెరువు పై ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం పై ఇరిగేషన్, టూరిజం, మున్సిపల్ అధికారులకు సూచించారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.