ఏపీకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తన కేబినెట్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,కాపులకు చెందిన ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రులుగా కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నట్లు సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనే అంశం గురించి వార్తలు జోరుగా వినిపిస్తోన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మైనార్టీ వర్గం నుండి అంజాద్ బాషా,ఎస్సీ సామాజిక వర్గం నుండి సుచరిత,కాపు సామాజిక వర్గం నుండి ఆళ్ల నాని,యాదవ కోటా నుండి పార్థసారధి ,ఎస్టీ సామాజిక వర్గం నుండి రాజన్నదొర పేర్లు వినిపిస్తోన్నాయి. అయితే రేపు శనివారం ఉదయం 11.49గంటలకు ఏపీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ మేరకు సచివాలయం పక్కన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తోన్నారు సంబంధిత అధికారులు..
