ఏపీలో ఎక్కడ చూసినా ప్రస్తుతం జగన్ జగన్ అనే వినిపిస్తుంది.అందరు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి గెలిచాక సైలెంట్ గా ఉంటారు.కాని ప్రస్తుతం ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ మాత్రం నవశకం తీసుకొస్తున్నాడు.ఈ మేరకు ఇప్పటికే చాలా వరకు సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాడు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా గడికోట శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు.ఈయన రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే.ఈయనతో పాటు మరో ఐదుగురు విప్‌లను నియమించడం జరిగింది.కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు విప్‌లుగా నియమించడం జరిగింది.
