నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోకసారి తన మార్కును ప్రదర్శించారు. తనను నమ్ముకున్నవాళ్లకోసం ఎంతదూరమైన పోతాను. ఏమైన చేస్తానని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది. శనివారం నవ్యాంధ్ర క్యాబినేట్ కొలువదీరిన సంగతి తెల్సిందే. ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో పాటుగా మొత్తం ఇరవై ఐదుమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే. అయితే
వైసీపీలో ఉన్న అందరికీ అవకాశమివ్వడం సాధ్యం కాదు.
తర్వాత రెండున్నరేళ్ల తర్వాత విస్తరించనున్న క్యాబినేట్లో అవకాశమిస్తానని.. ప్రస్తుతం కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తానని మంత్రి వర్గ విస్తరణకు రోజు ముందు వైసీపీ అధినేత,సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెల్సిందే . అందులో భాగంగా మంత్రి వర్గంలో చోటు దక్కని .. ఆది నుండి తనతో ఉన్న ఎమ్మెల్యేలు అయిన అంబటి రాంబాబు,ఆనం నారాయణ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,ఆర్కే రోజాకు నామినేటెడ్ పదవులు ఇస్తానని జగన్ చెప్పారు.
ఈ క్రమంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏపీఎస్ఆర్టీసీ,ఏపీఐఐసీ,పలు కార్పోరేషన్ల ఛైర్మన్లతో పాటుగా ప్రభుత్వ విప్ పదవులను కూడా కట్టబెడతానని జగన్ హామీచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు అచ్చం తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా నమ్ముకున్నవారి కోసం,కష్టాల్లో తోడుగా ఉన్న వారికోసం చేసినట్లుగా ప్రస్తుతం సీఎం జగన్ తన తండ్రి బాటలో నడుస్తూ పార్టీకోసం కష్టపడిన ,కష్టకాలంలో తోడుగా ఉన్నవారికి సముచిత గౌరవం కల్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారని ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు.