తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి యావత్తు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకోసం గురుకులాలు ప్రారంభిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నూట పంతొమ్మిది బీసీ గురుకులాలను ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. గురుకులాలను జిల్లాల వారీగా ఈ నెల పదిహేడున స్థానిక మంత్రులు,ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు అని అన్నారు. అయితే తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో బీసీలకు కేవలం పంతొమ్మిది మాత్రమే ఉన్నాయి. కానీ రాష్ట్రమేర్పాటు తర్వాత ఐదేండ్లలో నూట నలబై రెండు కొత్త బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా 119మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని.. దీంతో మొత్తం గురుకులాల సంఖ్య రెండు వందల ఎనబైకు చేరుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.