ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ హేమాహేమీలు అందరు ఓడిపోయారు.అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో సమావేశం అయ్యారు.ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు,నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు జగన్ కు సహకరించాలని ఆయన అన్నారు.చంద్రబాబుగారు మీకు మళ్ళీ చెబుతున్నా,మీకు ఓటు వేసిన వ్యక్తులకు కూడా అర్హత ఉంటే జగన్ అందరికి సాయం చేస్తారని అన్నారు.జగన్ అన్ని మతాలవారికి,అన్ని కులాలవారికి, అన్ని ప్రాంతాలవారికి వారికి మేలు చేసే నాయకుడు అని అన్నాడు.జగన్ తన పాలనతో అందరికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి.అలాంటి వ్యక్తికి మీరు అన్ని విధాలా తోడ్పడి ఉండాలని చెవిరెడ్డి తన ప్రసంగంలో అన్నారు.