ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు చోటు దక్కలేదు.దీంతో మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ గా రోజాను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.
