తెలంగాణ రాష్ట్రం లో సోమవారం గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో బాలురకు 63, బాలికలకు 56 గురుకులాలను కేటాయించారు.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
మంత్రులు, ఎమ్మెల్యేలు, జె డ్పీ చైర్‌పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం ఏర్పడింది. ఏకకాలంలో 119 బీసీ గురుకులాలు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి అందజేశారు.
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండగా తెలంగాణ వచ్చిన వెంటనే 24 గురుకులాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత 2017-18 విద్యా సంవత్సరంలో 119 బీసీ గురుకులాలను ఒకేసారి ప్రారంభించగా, తా జాగా 2019-20 విద్యాసంవత్సరానికి గాను 119 నియోజకవర్గాల్లో ప్రారంభించడం విశే షం. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ గురుకుల విద్యాలయాలు అందుబాటులోకి వ చ్చాయి. వీటిలో 92,340 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం దక్కింది.
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !