మాజీ సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో దిట్ట.. సమస్యలనుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆయన స్టైలే వేరు.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో తనకు తానే సాటి.. బ్రిటిషర్లతో పోరాడానని, బాహుబలి సినిమాకు ఆస్కార్ ఇప్పిస్తానని, రాజధానికి 7 శంకుస్థాపనలు చేయడం.. విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేయడం ఆయనకే చెల్లింది. కూలీ నెంబర్1 అని చెప్పుకుంటూ ఫైవ్‌స్టార్ హోటళ్లలో నివాసముండే ఈయన తిమ్మిని బమ్మిని చేస్తూ ఆత్మస్తుతితో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. నదుల అనుసంధానం, కరువుపై రెయిన్ గన్, దోమల పై దండయాత్ర, ప్రాజెక్టుల నిద్ర, నవనిర్మాణ దీక్ష, నీరు – చెట్టు పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేసిన చంద్రబాబు దారుణమైన పాలన చేసారు.
రాష్ట్రం రెవెన్యూలోటును ఎదుర్కొంటూ కష్టాల్లో ఉందంటూనే అనవసర ఆర్భాటాలకు, సొంత ప్రచారాలకు భారీ ఎత్తున దుబారాకు పాల్పడ్డారు. గత ఐదేళ్లలో ప్రచార ఆర్భాటాలకు, తాత్కాలిక నిర్మాణాలకు కలిపి మొత్తం రూ.3,628.17 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. గత 5ఏళ్లుగా ప్రచారమే పరమావధిగా పాలన సాగించారు. ప్రజల ష్టి మరల్చేందుకు రోజుకోమార్గం ఎంచుకుంటున్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల నుంచి రాజధాని శంకుస్థాపనలు, విదేశీ పర్యటనలు, నదుల అనుసంధానం, కరువుపై యుద్ధం, దోమలపై దండయాత్ర, ప్రాజెక్టుల వద్ద నిద్ర, నవనిర్మాణదీక్ష, హ్యాపీ సండే.. ఇలా ప్రతీ కార్యక్రమాన్ని ఈవెంట్ లా నిర్వహించారు. కేవలం ఈవెంట్లకోసం కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ప్రచారమే ప్రభుత్వంగా నాలుగున్నరేళ్ల కాలం గడిపారు. మళ్లీ ‘ఇది ఒక చరిత్ర’ అంటూ సొంతడబ్బాతో ప్రజల బుర్రతినేసారు.
రాజధాని శంకుస్థాపనలకు తొలుత రూ.250 కోట్లు, పరిపాలన భవనం, సీడ్ కేపిటల్, రహదారుల శంకుస్థాపనల పేరుతో మరో రూ.100 కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలుదె. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ ప్రజల నుంచి విరాళాలు, డబ్బుల రూపంలోను, ఇటుకలను తీసుకున్నారు. అక్కడ నిర్మించిన తాత్కాలిక భవనాలు చూపించడానికి కోట్ల రూపాయలు వ్యయం చేసారు. చంద్రబాబు రెగ్యులర్ విమానాల్లో వెళ్లడం ఎప్పుడో మానేశారు. జిల్లాలకు వెళ్లినా, ఢిల్లీకి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగడానికి ఐదేళ్లలో మొత్త రూ.100 కోట్లు ఖర్చయింది. భాగస్వామ్య సదస్సుల పేరుతో రూ.150 కోట్లు ఖర్చుపెట్టారు. ఆర్భాటాలతో సింగపూర్‌కు నాలుగుసార్లు, ప్రపంచ ఆర్థిక సదస్సుకు మూడుసార్లు, జపాన్, బ్రిటన్, చైనా, రష్యా, అమెరికా పర్యటనలకు వేల కోట్లు ఖర్చుపెట్టారు.. మంత్రులు, అధికారులు విహార యాత్రలతో ఎంజాయ్ చేశారే కానీ ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు.. పైసా పెట్టుబడి వచ్చింది లేదు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం భవనాలకు కోట్ల రూపాయల వ్యయంతో సోకులు చేశారు. జన్మభూమి ఆరుసార్లు నిర్వహించి రూ.150 కోట్లు వ్యయం చేశారు.. నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏటా రూ.20 కోట్లను వ్యయం చేశారు. హ్యాపీ సిటీ సదస్సును తెరమీదకు తెచ్చి రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
రియల్‌టైమ్ గవర్నెన్స్ పేరుతో వందల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రచారానికి వినియోగించారు. ఢిల్లీలో ఒక రోజు పది కోట్లు వెచ్చించి రాజకీయ సభలను ఏర్పాటు చేసింది. సొంత మీడియా సంస్థలకు భారీఎత్తున ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. ఎన్నికల ముందు ప్రజాధనాన్ని ఇష్టానుసారం సొంత ప్రచారం కోసం వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తులు వేశారు. పోలవరం పూర్తి చేయకుండానే.. ఏదో అయిపోతున్నట్లు విహారయాత్రల పేరుతో ఏకంగా రూ.121.81 కోట్లు వ్యయం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఈవెంట్లు, సమీక్షలకు మరో రూ.152 కోట్ల ఖర్చయింది. సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు సొంతఇమేజ్ పెంచుకోవడానికి రూ.13.76 కోట్లు ప్రజాధనం వృథా చేసారు.. వీటన్నిటినీ గతంలోనే తప్పుపట్టింది. ప్రభుత్వ ధనాన్ని రాజకీయంగా వ్యయం చేయడాన్ని కాగ్ ఎత్తి చూపింది. ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. మరికొద్దిరోజుల్లోనే ఈ అంశాలపై సీబీఐ విచారణ జరగనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.