తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. కాగా గత కొద్ది రోజులుగా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే వారి పేర్లు ఇవే అంటూ ఆసక్తికర పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫిదా ఫేం గాయత్రీ గుప్తా పేరు బయటకు వచ్చింది. సెక్సువల్ ఇష్యుస్ పై కామెంట్స్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించి క్రేజ్ కొట్టేసింది గాయత్రి గుప్తా. ఇక ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో కాస్టింగ్ కౌచ్, మహిళలపై లైంగిక దాడులు లాంటి అంశాలపై కామెంట్స్ చేసి ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమె బిగ్ బాస్ పార్టిసిపెంట్ అనే సరికి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక రోజు బిగ్ బాస్ లో గుస గుసలే..గుస గుసలు అంటున్నారు అభిమానులు.
