Home / CRIME / AP 24X7 ఛానెల్ సీఈఓ వెంకటకృష్ణపై పోలీసులకు పిర్యాదు.

AP 24X7 ఛానెల్ సీఈఓ వెంకటకృష్ణపై పోలీసులకు పిర్యాదు.

AP 24X7 ఛానెల్ సీఈఓ పర్వతనేని వెంకటకృష్ణ చౌదరిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు అందింది. ఇటీవల ఒక రోజు ఏపీ 24X7 ఛానెల్లో జరిగిన ఒక చర్చ కార్యక్ర్తమంలో వెంకటకృష్ణ చౌదరి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళిళ్ల సమయంలో ఆడబిడ్డకు ఒడిబియ్యం కట్టడం వెనక అసలు ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు బియ్యం వలన వచ్చే అన్నం తినరు. ఆ ఒడిబియ్యంతోనే అన్నం తినడం మొదలెడ్తారు అని తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గుర్తించి తెలంగాణ వాదులు,సోషల్ మీడియా యాక్ట్ విస్టులు హైదరాబాద్ మహానగరంలో నిన్న గురువారం జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్ 78లో ఉన్న్ ఆ ఛానెల్ యొక్క ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఆ తర్వాత స్థానిక పోలీసు స్టేషన్ లో వెంకటకృష్ణపై పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలను ,సంస్కృతి సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడిన వెంకటకృష్ణ తెలంగాణ సమాజానికి,మహిళలకు క్షమాపణలు డిమాండు చేశారు.