తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 103ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తిస్థాయి ఫీజులు ఖరారు అయ్యాయి. మిగతా 88కాలేజీల్లో
15నుంచి 20శాతం ఫీజులను పెంచింది సర్కారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న కాలేజీల్లో 15శాతం పెంచారు. 50వేల కంటే తక్కువగా ఉన్న కాలేజీల్లో 20శాతం పెంచారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కారు పెంచిన
ఫీజులతో రాష్ట్రంలోని 22ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలకు పైగా చేరింది..
