టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.. గతంలో షమీ స్త్రీలోలుడని ,చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు అని షమీ వైఫ్ హసీనా ఆరోపించిన సంగతి విదితమే.
అయితే తాజాగా సోఫియా అనే మహిళా షమీ తనతో నిత్యం చాటింగ్ చేశాడని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో 1.4మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఒక గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసె చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా అని
సోఫియా ట్వీట్ చేసింది. అయితే సోఫియాపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
