తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం నరసింగపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారికి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితుడ్ని పరామర్శించారు. జిల్లా ఏరియా ఆస్పత్రి డాక్టర్ తో మంత్రి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. బాధితుడ్ని పరామర్శించిన వారిలో వనపర్తి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గట్టు యాదవ్. సిహెచ్ కుమార్. టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
