అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సోదరి అయిన వైఎస్ షర్మిల వైఎస్సార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల జూలై ఎనిమిదో తారిఖున వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులైన దాదాపు ముప్పై మందికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దరు పంచె,చొక్కాలను ఒక్కొక్కరికి ఒక్కో జత చొప్పున ప్రత్యేకంగా ప్యాక్ చేసి మరి పంపించారు.వీటిలో కొంతమందికి ఇప్పటికే చేరడంతో అందరూ ఆనందంతో ఉబ్బితబ్బి అయిపోతున్నారు.. వైఎస్సార్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలకు కూడా పంపినట్లు సమాచారం..
