అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎమ్.ముకేష్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా కాన్సర్ తో బాదపడుతున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి విషమించిందని సమాచారం వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సన్నిహితవర్గాల కదనం. వైద్యానికి ముఖేష్‌గౌడ్ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు చికిత్స నిలిపివేశారని కూడా వార్తలు సూచిస్తున్నాయి.
