తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిపిన భేటీ ముగిసింది. దసరా పండుగకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు పార్టీ అధినేత నిర్దేశం చేశారు. జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేశారు. అదేవిధంగా ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ. 60 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు.
