తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు పుట్టగతులుండవు.. పార్టీ అసలు బ్రతకదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తున్న ఆపడం చేతకాని అధ్యక్షుడు అని పరుష పదజాలంతో కోమటిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్తారు అని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడారు. అయితే తాజాగా ఈ వార్తలపై కోమటిరెడ్డి స్పందిస్తూ”తనను బీజేపీ పిలవడం లేదని.. తాను కూడా కాషాయ కండువా కప్పుకోవట్లేదని ఆయన క్లారిటీగా చెప్పేశారు.
