నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడు ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సెటైర్ వేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్లో సీఎం జగన్ పై నారా లోకేష్ నాయుడు విమర్శల వర్షం కురిపించారు. 46ఏళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది.45ఏళ్ళ రత్నం పెన్షన్ మాయం అయింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు.. సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మరిచిపోయారా అంటూ నారా లోకేశ్ నాయుడు ట్విట్టర్లో విమర్శల వర్షం కురిపించారు.
