యువతకు స్పూర్తి మార్గదర్శకుడు కేటీఆర్ గారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ గారి జన్మధినం సందర్బంగా ఖిలావరంగల్ లోని మద్య కోటలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ గిఫ్ట్ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అందపాఠశాల విద్యార్దులకు బట్టలపంపిణీ చేపట్టారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మేయర్ గుండా ప్రకాశరావు,మాజీ ఎంపి సీతారాం నాయక్ హాజరయ్యారు.నియోజకవర్గ ముఖ్యనాయకులు,కార్పోరేటర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుమారుడంటే గతంలో ప్రజల్లో వేరే అభిప్రాయం ఉండదని కానీ కేటీఆర్ గారి ఎంట్రీతో ఆ అభిప్రాయం మారిపోయిందన్నారు.
ప్రతీక్షణం ప్రజల కోసం పరితపిస్తూ వారికి సేవచేసే నాయకుడు కేటీఆర్ గారన్నారు..యువతకు మార్గనిర్దేశకుడు కేటీఆర్ గారని,కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వారి నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారన్నారు..నేడు ఆయన జన్మధినం సందర్బంగా వారు ఇచ్చిన సందేశం మెరకు సేవ చేయాలనే సంకల్పంతో మొక్కలు నాటి గ్రీన్ గిఫ్ట్ అందజేయడం ద్వారా శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు.భవిష్యత్ లో తూర్పు నియోజకవర్గంలో కేటీఆర్ గారి బాటలో నడిచేవిదంగా ప్లెక్సీలు,బొకేలు లేకుండా ఏదైనా సేవాకార్యక్రమానికి,పేదల కోసం ఆ డబ్బును ఉపయోగించవలసిందగా తూర్పునియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు సూచిస్తున్నానన్నారు.
ప్లాస్టిక్ మొత్తం నివారించి క్లాత్ ద్వారా తయారు చేసిన వాటిని నిత్యం మన పనుల నిమిత్తం వాడే విదంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అందుక అనుగుణంగా నిన్న కలెక్టర్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది.ఆ వస్తువుల ఉత్పాదనకు సంబందించి 95శాతం ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చేందుకు ముందుకొచ్చింది.అందులో 25%రాయితిని అందిస్తుంది.తద్వారా ప్లాస్టిక్ ను రూపుమాపేందుకు అడుగులు పడనున్నాయన్నారు.యువనేత కేటీఆర్ గారి మార్గనిర్దేశనంలో ముందుకెలతామని వారికి తూర్పు నియోజకవర్గ పక్షాన జన్మధిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే ఈ సందర్బంగా అన్నారు.
Post Views: 279