బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేసారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. విభజన అనంతరం ఏపీకి నూతన గవర్నర్‌గా ఈయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తదితరులు వచ్చారు.