సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ కు శుభవార్త.. వ్యాపార రంగంలో మరో అడుగు ముందుకు వేసాడు. ఇప్పటికే ఏఎంబీ మాల్ తో మంచి బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకున్న మహేశ్, ఇప్పుడు వస్త్ర రంగంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ” ది హంబుల్ కో ” అనే బ్రాండ్ తో వస్త్ర వ్యాపారం ప్రారంబిస్తునట్లు తెలిపాడు. మరి ఇంక ఏది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయానికి వస్తే ఆగష్టు 7న స్టార్ట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడట. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో దానికి రెండురోజుల ముందే స్టార్ట్ చేయనున్నారు.మహేష్ భార్య బిజినెస్ పరంగా చాలా పెద్ద ఆలోచలను ఉన్నాయని అందరికి తెలిసిందే. మహేష్ సంపాదన మొత్తం ఈమె ఇలా బిజినెస్ రూపంలో పెడతారు.ఇది మహేష్ పెట్టడంతో ఇది కూడా సంచలనం అవుతుందని అందరు అనుకుంటున్నారు.
