Home / ANDHRAPRADESH / ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?

ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?

తెలుగు రాజకీయాల్లో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవేమో..ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కూడా ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తుంది. పాపం పయ్యావులకు మంత్రి కావాలని ఆశ…టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పయ్యావుల ఓడిపోవడం, పయ్యావుల గెలిచినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం సెంటిమెంట్‌గా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయారు. 2019లో చచ్చీచెడీ గెలిస్తే…టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి ఆశ తీరకుండా పోయింది.

తాజాగా అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావులను నియమించాడు చంద్రబాబు. దీంతో మరో సెంటిమెంట్ మొదలైంది. సాధారణంగా పీఏసీ ఛైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష వైసీపీని పూర్తిగా బలహీన పర్చాలనే లక్ష్యంతో అప్పటి పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న భూమానాగిరెడ్డిని మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టి తన పార్టీలోకి లాక్కున్నాడు. ఆ తర్వాత వరుసగా 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన పార్టీలోకి లాక్కున్నాడు చంద్రబాబు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసారని వైసీపీ నేతలు తెగ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా పీఏసీ ఛైర్మన్‌గా బాబు తన సామాజిక వర్గానికే చెందిన పయ్యావులకు అప్పగించాడు. పీఏసీ ఛైర్మన్‌ పదవికి బీసీ కోటాలో అచ్చెంనాయుడు, కాపు కోటాలో గంటా తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బాబు తన సామాజిక వర్గానికే చెందిన పయ్యావుల వైపే మొగ్గు చూపాడు. దీనికి కారణం పయ్యావుల ఏ క్షణంలోనైనా వైసీపీలోకి పోతాడనే భయంతోనే అని తెలుగు తమ్ముళ్లు గుసగులాడుకుంటున్నారు. నిజానికి చంద్రబాబుపై పయ్యావుల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. గత ఎన్నికలకు ముందే పయ్యావుల వైసీపీలోకి వెళతాడు అని వార్తలు వచ్చాయి కానీ..ఎందుకో కార్యరూపం దాల్చలేదు.

ఏపీలో టీడీపీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ పయ్యావుల తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నాడని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. దీంతో భయపడిన చంద్రబాబు అచ్చెం, గంటాలను కాదని పీఏసీ ఛైర్మన్‌ పదవిని పయ్యావులకు అప్పగించాడంట. తాజాగా తెలుగు తమ్ముళ్లు మరో సెంటిమెంట్ బయటకు తీస్తున్నారు. గత బాబు హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న భూమా టీడీపీలో చేరాడని..ఇప్పుడు పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల కూడా వైసీపీలో చేరుతాడంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ వారే తనపై పార్టీ మారుతున్నాడంటూ చేస్తున్న ప్రచారంపై పయ్యావుల గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే పయ్యావుల తమ పార్టీలో చేరే అవకాశం లేదని, ఒక వేళ వచ్చినా తమ అధినేత జగన్ చెప్పినట్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పయ్యావుల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరే అవకాశాలు దాదాపుగా లేదు. పయ్యావుల ఒక వేళ పార్టీ మారినా బీజేపీలోకి వెళ్లాలే తప్ప…వైసీపీలోకి వెళ్లే అవకాశమే లేదు..కానీ తెలుగు తమ్ముళ్లే..పయ్యావులను బయటకు పంపించేందుకు ఇలా సెంటిమెంట్ పేరుతో పార్టీ మారుతున్నాడంటూ ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి సెంటిమెంట్ ప్రకారం…పయ్యావుల పార్టీ మారుతాడా లేదా అన్నది తెలియాలంటే..మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat