నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ కనకాల మామ దేవదాస్ కనకాల కన్ను మూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను చేసిన నటగురువు దేవదాస్ కనకాల. ఈయనపేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణతీసుకున్నారు. గొప్పగొప్ప నటులు కూడా ఇవదులో ఉన్నారు. స్టార్ హీరోలు కూడా చాలామందే ఉన్నారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, నాజర్, ప్రదీప్ శక్తి, భాను చందర్, అరుణ్‌పాండ్యన్, రఘువరన్ వంటి నటులతోపాటు చాలామంది ఆయన వద్ద పాఠశాలలో శిక్షణ తీసుకున్నారు. దేవదాస్ కనకాల 1945 జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు.
