Home / ANDHRAPRADESH / ఓ బొల్లినేని గాంధీ… ఓ సానా సతీష్..ఓ చంద్రబాబు..ఏంటా కథ…?

ఓ బొల్లినేని గాంధీ… ఓ సానా సతీష్..ఓ చంద్రబాబు..ఏంటా కథ…?

ఆ మధ్య మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీ కేసులో వ్యాపారవేత్త సానా సతీష్‌బాబు అరెస్టయ్యారు. సతీష్‌బాబు ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలో సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానాపై సతీష్‌ అవినీతి ఆరోపణలు చేశారు. తాజగా విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ పని చేసిన సతీష్‌బాబుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై సీబీఐ ఆరా తీయగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. విచారణలో అనేక విషయాలను వెల్లడించిన సతీష్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ సానా సతీష్ ఎవరో కాదు…మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

ఇక బొల్లినేని గాంధీ విషయానికి వస్తే..ఈయనగారు బాబుగారికి అత్యంత సన్నిహితుడిగా పేరొంది, ఆయన ఆదేశాల మేరకు ఈడీలో నడుచుకున్నట్లు ఆరోపణలున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి, జీఎస్టీ ప్రస్తుతసూపరింటెండెంట్. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పనిచేశారు. ఇటీవల బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఆయన అక్రమ ఆస్తుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ రట్టుచేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. మొత్తంగా గాంధీ 288 శాతం మేర ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలతో సహా తేల్చారు. రూ.3.74 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

తాజాగా మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టు అయిన సానా సతీష్ కు, అక్రమాస్తులతో పట్టుబడిన బొల్లినేని గాంధీకి మధ్య సంబంధాలున్నట్టుగా వస్తున్న వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. బొల్లినేని గాంధీ, సానా సతీష్ ల మధ్య బంధం విచారణలో బయటపడిందని, వీరిద్దరినీ కలిపి విచారిస్తే అక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా బయటపడుతుందని విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ …ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..”మనీ లాండరింగ్ దళారి సానా సతీష్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. EDలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా అవినీతి బాగోతాలు వెలుగు చూస్తాయి..” అంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. మొత్తంగా ఓ బొల్లినేని గాంధీ..ఓ సానా సతీష్..ఓ చంద్రబాబుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై లోతుగా విచారణ చేయిస్తే…నిప్పు బాబుగారి అవినీతి బాగోతం కూడా బయటపడుతుందని విజయసాయిరెడ్డి అంటున్నారు. సీబీఐ విచారణలో బొల్లినేని, సానా, నారాల మధ్య బంధం ఏంటో త్వరలోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. సానా సతీష్, బొల్లినేనితో బాబుగారి కున్న సన్నిహిత సంబంధాలు ఏంటో…విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat