మిషన్ కశ్మీర్‌లో కీలకపాత్ర పోషించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అయన అక్కడ స్థానికులతో కలిసి ముచ్చటించారు. సోపియాన్‌లో స్థానికులతో కలిసి నడ్డిరోడ్డుపైనే భోజనం చేశారు. అక్కడ స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు కొందరు సైనికులను కూడా కలిశారు. లోకల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులతో సమావేశమైన దోవల్… నేను ఇక్కడ పనిచేశా.. నాకు ఇక్కడి పరిస్థితులేంటో తెలుసన్నారు. కశ్మీర్‌లో పోలీసు ఉద్యోగం చేయడమే ఛాలెంజ్.. మీ కుటుంబసభ్యులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసని.. వారికి ధైర్యాన్ని చెప్పారు.
#WATCH Jammu and Kashmir: National Security Advisor Ajit Doval interacts with locals in Shopian, has lunch with them. pic.twitter.com/zPBNW1ZX9k
— ANI (@ANI) August 7, 2019