నిత్యం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ యాక్టివ్ గా ఉండే యువనేత,తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు,తెలంగాణ సమాజానికి ట్విట్టర్ వేదికగా మరో పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని కేటీఆర్ రామారావు పిలుపునిచ్చారు. చిప్పలపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ చెట్ల ద్వారా ప్రకృతి మరింత శోభను సంతరించుకుందని నిన్న శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కోన్నారు..
