సంపూర్ణేష్ బాబు…హీరోగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందురోజు అక్కినేని నాగార్జున చిత్రం మన్మధుడు-2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో నాగ్ సినిమా దెబ్బకు కొబ్బరిమట్ట విరిగిపోతుందని అనుకున్నారు అంతా. కాని నాగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు సంపూ పై పడ్డాయి. దీంతో రిలీజ్ రోజు థియేటర్లు మొత్తం ఫుల్ అయ్యాయి. ఇక ఈ చిత్ర కలెక్షన్లు విషయానికి వస్తే 3 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 12కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇందులో సంపూ త్రిపాత్రాభినయం పోషించాడు. ఇందులో షకీలా కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఒక మంచి కామెడీ అండ్ డైలాగ్ ఎంటర్టైనర్ వచ్చిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నిర్మించాడు. అయితే ఈ సినిమా దెబ్బకు మన్మధుడు మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి.
