అన్నా బాగున్నారా.. అక్కా బాగున్నారా..? చెల్లెమ్మ, తమ్ముడు, అవ్వతాతలు అంతా బాగున్నారా.? అంటూ ఏపీ సీఎం తన ప్రసంగాన్ని డల్లాస్ లో ప్రారంభించారు. ఖండాలు దాటినా మీప్రేమ, అప్యాయత చూస్తే ఎంతో ఆనందంగా ఉంది.. నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికి జగన్ అనే నేను నిండు మనుసుతో ప్రేమాభివందనాలు చేస్తున్నా అన్నారు. అమెరికాలో ఉంటున్నా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు పోషించిన పాత్ర ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. 175 నియోజకవర్గాలకు 151 ఎమ్మెల్యే స్థానాలు గెలిచామంటే, 22 ఎంపీ స్థానాలు గెలిచామంటే.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని విధంగా 50 శాతం ఓటు సాధించామంటే.. వీటంన్నిటిలోనూ ఇక్కడి వారి కృషి ఎంతోఉంది అన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన ప్రతీ మాటకూ విశేష స్పందన లభించింది. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనామేరకు దాదాపు 9 వేలమంది వరకూ హాజరైనట్లు సమాచారం.
అంతేకాదు.. డౌన్ టౌన్ లో స్థానిక సమస్యలపై ధర్నా జరుగుతుంది.. ఎవ్వరినీ రానివ్వటం లేదని వెళ్తే ఇబ్బందులు పడతారని కొంతమంది ప్రజలని తప్పుదోవ పట్టించటానికి విష ప్రచారం చేసినా ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా అంచనాలకి మించి హాజరయ్యారు. సభకి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అభిమానులని నిలవరించటం పోలీసులకి శక్తికి మించిన పనైంది. అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా ఇవన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా ఎప్పుడో ఖాళీగా ఉన్న ఆడిటోరియం వీడియోలతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఏకంగా జనం రాలేదనే ప్రచారం చేయాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఊరుకుంటుందా.. అప్పట్లో చంద్రబాబు అమెరికాలో పర్యటించిన వీడియోలను పోస్ట్ చేసి అసలు విషయాన్ని బయటపెట్టింది. అమెరికాలో ఆంధ్రులంతా జగన్ సభకు 10 వేల కెపాసిటీ గల పెద్ద స్టేడియంలో దాదాపుగా 9వేల మంది హాజరవగా.. చంద్రబాబు సభకు 3500 మంది సామర్ధ్యం ఉన్న చిన్న స్టేడియం కూడా జనాలు లేక వెలవెలబోయిన వీడియోలు బయటపెడుతున్నారు.