అగ్ర కథానాయికలలో ఒకరిగా ఉన్న అక్కినేని సమంత జిమ్‌లో చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన సమంత వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఫిట్నెస్ కోసం కూడా చాలా శ్రమపడుతుంటుంది. తాజాగా సమంత ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని పట్టుకొని రెండు చేతులతో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చర్యపరచింది. సమంతలో దాగి ఉన్న సామర్ద్యాన్ని చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు సమంత వీడియోని చూసి షాక్ అయిన నమ్రత, కాజల్, పూజా హెగ్డే, సుశాంత్ తదితర ప్రముఖులు కామెంట్స్ పెట్టారు. సమంత అమేజింగ్ అని ప్రశంసించారు.
