Home / ANDHRAPRADESH / జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?

జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?

వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు పొగిడారుజ వీరిద్దరూ పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తంచేశారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ . త్వరలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే విషయంపై అన్నిచోట్లా ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై పారిశ్రామికవేత్తలు కచ్చితంగా ఒకసారి ఆలోచించాలని చెప్పారు. నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇస్తామన్నారు. పైసా అవినీతి లేకుండా అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో తామంతా పనిచేస్తున్నామన్నారుతాము అధికారంలోకి వచ్చి రెండునెలలు కాక ముందే పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ దుర్మార్గపు అరోపణలు‌ చేయడం సమంజసం కాదన్నారు రోజా.