నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన హాట్ బ్యూటీ నబా నటేష్.. ఆమె ఈమధ్య రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించారు. నటేష్ తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది.. అయితే గ్లామర్ పరంగా ఈమెకు వస్తున్న అట్టెన్షన్ తనకి నచ్చడం లేదట.. ఈ విషయాన్ని ఆమె మీడియాతో మాట్లాడుతూ తర్వాతి సినిమా డిస్కోరాజాలో తాను కేవలం ఒక గ్లామర్ డాల్ గా మాత్రమే కాకుండా నటిగా నిరూపించుకోబోతున్నట్లు తెలిపింది. నిజానికి నభా నన్ను దోచుకుందువటే సినిమాతోనే తన నటనకి మంచిమార్కులు పడ్డాయి. కానీ ఈమె ఇలాంటి స్టేట్మెంట్ లు ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం హ్యాపెనింగ్ బ్యూటీగా ఈమె గ్లామరస్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో కచ్చితంగా ఈమెకి ఆఫర్లు తగ్గిపోతాయనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు కమర్షియల్ సినిమాలు వద్దని చెప్పి ఆఫర్లు లేక ఏకంగా ఇండస్ట్రీనే వదిలి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
