తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావుతో కల్సి కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. 1989లో దొమ్మాట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు.