Home / MOVIES / బిగ్‌బాస్‌ ఇంట్లో..వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం

బిగ్‌బాస్‌ ఇంట్లో..వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం

కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌-3 ఏడో వారానికిగానూ నామినేషన్‌ప్రక్రియ పూర్తైంది. ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రవి, అలీ, మహేష్‌, రాహుల్‌, శ్రీముఖి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంట్లో దొంగలుపడ్డట్లు తెలుస్తోంది. దొంగలు దోచిన నగరం అనే ఈ టాస్క్‌లో ఇళ్లంతా యుద్దవాతావరణాన్ని తలపిస్తోంది. ఒకర్నొకరు మాటలతో దూషించుకుంటూ ఉన్నారు.

తాజాగా రిలీజ్‌ చేసిన ఈ ప్రోమోను బట్టి ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో పునర్నవి-శ్రీముఖి వాగ్వాదం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇక వితికా కూడా రెచ్చిపోయినట్లు అర్థమవుతోంది. వరుణ్‌-వితికాలకు కూడా ఏదో గొడవ జరగనున్నట్లు చూపించారు. మరి నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఈ టాస్క్‌లో ఎవరు గెలుపొందారు? వాంటెడ్‌ అని చూపించిన వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ శిల్పా చక్రవర్తి.. టాస్క్‌లో పోషించే పాత్ర ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat