తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో పరకాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి గారు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి గార్లు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమంగా ఏదైనా వృత్తి లో పనిచేసిన వారికి సన్మానించడం గొప్ప విషయం ఇందుకు లయన్స్ క్లబ్ వారికి అభినందనలు.ఉపాధ్యాయులు వారు బోధించే దానిబట్టే విద్యార్థులు ఉన్నంత శిఖరాలకు ఎదుగుతారు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడ్డాయన్నారు.ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 500 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు.ప్రభుత్వ పాఠశాలలో,రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మంచి పోషకాహారం లభిస్తుందిఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలను అందుకుంటున్న వారిని మిగతా వారు ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో అన్నీ రకాల మౌలిక వసతులు ఉన్నప్పటికీ…తల్లిదండ్రులు ప్రయివేట్ స్కూల్స్ కు ఆకర్షితులు అవుతున్నారు.తల్లిదండ్రులు ఆ ఆలోచన మార్చుకోవాలని కోరారు.విద్యార్థుల సంఖ్య పెంచేందుకు టీచర్స్ కృషి చేయాలని,గ్రామస్తుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం వచ్చేలా చూడాలన్నారు.
ఉపాధ్యాయు వృత్తి అనేది…. ఆదర్శమైన వృత్తి.ఆ దేవుడు టీచర్లకు ఇచ్చిన గొప్ప అవకాశము.ఈరోజు మన రాష్ట్రంలో 959 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు అయ్యాయి అంటే మన ముఖ్యమంత్రి గారు విద్య కు ఇస్తున్న ప్రాధాన్యత అర్థం అవుతోంది.తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవస్తానం ఉపాధ్యాయులదేనని అన్నారు.ఈ ఏడాదిపదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఉత్తిర్ణత వచ్చేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు.మంచి ఉత్తీర్ణత ఇస్తే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు.
Post Views: 322