అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. కారణం చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడమేనని తెలుస్తోంది. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. పెదపాడు మండలం వడ్డిగూడెంకు చెందిన రామరాజు అనే వ్యక్తి చింతమనేని గతంలో తనని, తన కుటుంబాని రకరకాలుగా హింసించాడని, తన అనుచరులతో బెదిరించాడని చెప్పాడు. అయితే చింతమనేని పోలీసులకు దొరికితే మాత్రం పర్మినెంట్ గా జైలే గతి అని భావిస్తున్నారు.