తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. అవన్నీ నేనంటే గిట్టని వారే ప్రచారం చేస్తున్నా వార్తలు. నేను పదవులకోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకోసమే రాజకీయాల్లో ఉంటున్నాను.
ఇరవై ఏళ్లు ప్రజలకోసమే రాజకీయాల్లో ఉంటున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అప్పటి ఉద్యమ నాయకుడు,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకే తన మంత్రి పదవీకి రాజీనామా చేసి తెలంగాణకై టీఆర్ఎస్లో చేరాను. టీఆర్ఎస్లోనే ఉంటాను. నాపై అసత్య ప్రచారాలను చేసేవారిపై పరువు నష్టదావా కేసు వేస్తాను అని ఆయన క్లారీటీచ్చారు..