‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్‌ను ‘యూజ్‌లెస్ ఫెలో’ అంటూ తిట్టారు. దీనిపై స్పందించిన మంత్రి ధర్మాన్న కృష్ణదాస్ అతడిపై మండిపడ్డారు. ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏవేవో ప్రయత్నాలు చేసి అలజడులు సృష్టించాలి అనుకుంటున్నారని అన్నారు. నీ నీచపు రాజకీయంతో శ్రీకాకుళం పరువు తీస్తున్నావ్ అని ధ్వజమెత్తారు.