తెలంగాణ రాష్ట్ర ఉప ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపా బజ్వాను కలిశారు. రానున్న జనవరి నెలలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో మహరాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లోని కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో ఎన్నికలు నిర్వహించారు అని ఆయన గుర్తు చేశారు.
