ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు, సూచనలు చేయాని పవన్ కళ్యాణ్ 100 రోజుల తరువాత ఏదో ఆడియో ఫంక్షన్ కి వచ్చినట్లు వచ్చి ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఒక్కసారి గతంలోకి వెళితే ఆనాడు కూడా ఐదేళ్లలో పవన్ తెలుగుదేశం పార్టీ అని కనీసం విమర్శించలేదు. ఏరోజు ప్రశ్నించలేదు అప్పుడు కూడా వైసీపీని తిట్టడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు.జగన్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే సంక్షేమ పథకాలకు వందల కోట్లు కేటాయించి ఉద్యోగుల జీతాలు పెంచి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ 108, 104 సేవలు, పాఠశాలను తీర్చి దిద్దుతూ సంక్షేమ పాలనలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ముందుకు వెళ్తున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని చంద్రబాబు ఆధ్వర్యంలో చెప్పిన విధంగా చేస్తూ ఇలా వ్యవహరించడం సరి కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.