న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి చిత్రం ఇదే. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మరి హిట్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే.. సినిమా పరంగా బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నెమ్మదిగా ఉందని సమాచారం. కాని గుంటూరులో మాత్రం కలెక్షన్ల హవా నడుస్తుందని సమాచారం. చిత్రం విడుదలయ్యి మూడు రోజులు అయ్యింది. ఈ మూడు రోజుల్లో వసూళ్ళు పరంగా గుంటూరు వ్యాప్తంగా కోటి రూపాయలు వచ్చాయి. నిన్న ఆదివారం కావడంతో ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం జరిగింది.
