బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె హిందీలో నటించిన సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం. ఈ సినిమాను శుక్రవారం కెనడాలో టొరంటోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా ప్రీమియర్ చూసిన ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. కన్నీరు కారుస్తూ.. సినిమా డైరెక్టర్ సోనాలీ బోస్‌ను హత్తుకున్నారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవ్వడం.. సినిమా అద్బుతంగా ఉందని.. మెచ్చుకోవడంతో ప్రియాంకతో పాటు సినిమా డైరెక్టర్ సోనాలీ బోస్ కూడా భావోద్వేగానికి గురైయారు. కాగా.. దీనికి సంబందించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
