మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో ఎవర్‌గ్రీన్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేశారు. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు ఎల్లువొచ్చి గోదారమ్మ పాట ప్రోమో వీడియోను విడుదల చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకి రీమేక్‌గా తెరకెక్కించిన వాల్మీకి.. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.