ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో ఇంతటి చక్కని విజయాన్ని నమోదు చేసుకున్నందుకు సహా నిర్మాత అయిన పూరి జగన్నాథ్ ఛార్మీకు అదిరిపొయే బహుమతిచ్చాడు. అలాంటి ఇలాంటి బహుమతి కాదు బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారునే గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఇంత గిఫ్ట్ తీసుకున్న ఛార్మీ ఊకుంటుందా .. ఆమె ఏకంగా రేంజ్ రోవర్ వోగ్ కారును పూరీకి గిఫ్ట్ గా ఇచ్చింది అమ్మడు..
