మన బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను అందించగల ఐదు ముఖ్య పదార్థాలను ఒకసారి పరిశీలిద్దాం..
1. అవిసె గింజలు
* ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి.
* వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది.
* ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి.
* మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
* జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు అవిసెల్లో పుష్కలంగా ఉన్నాయి.
* మెదడుకు శక్తినిస్తాయి. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు రోజూ అవిసె గింజలను తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు.
2. వాల్నట్స్
* రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో వాల్ నట్స్ ఔషధంలా పనిచేస్తాయి. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు, మినరల్స్ వీటిలో ఉంటాయి.
* మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాల్ నట్స్ బాగా పనికొస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను ఇవి తగ్గిస్తాయి.
* రొమ్ము క్యాన్సర్ రాకుండా వాల్ నట్స్ కాపాడతాయి.
* గుండె, దాని సంబంధ వ్యవస్థలను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీ కూడా అదుపులోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.
* గర్భిణీ మహిళలు వాల్ నట్స్‌ను రోజూ తీసుకుంటే పిండం పెరుగుదలకు అది తోడ్పడుతుంది. నెలలు నిండకుండానే జరిగే ప్రసవాన్ని ఇవి అడ్డుకుంటాయి.
* బరువు తగ్గుతారు, ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. వెంట్రుకల పెరుగుదలకు కూడా వాల్ నట్స్ పనికొస్తాయి.
* ఒత్తిడిని తగ్గించడంలో వాల్ నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు వీటిని నిత్యం తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.
3. చియా సీడ్స్ (Chia Seeds)
* మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్ తో పాటు అందాన్ని ఇనుపడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత సైతం తగ్గించి బౌల్ మూమెంట్ సమస్యను నివారిస్తాయి.
* శరీరంలోపల మాత్రమే కాదు, శరీరం బయట భాగాన్ని కూడా కాపాడుటలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి,
కొద్దిగా నూనె కలిపి గాయాల మీద అప్లై చేస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి.
* తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో పోరాడే వారు ఈ విత్తనాలను నీళ్ళలో వేసి అవి ఉబ్బిన తర్వాత ఆ నీటిని తాగితే..తక్షణ ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె నానబెట్టిన సబ్జగింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి.
* గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, లాంటి సమస్యలు బాధిస్తుంటే..ఈ గింజల్ని నీళ్ళలో వేసి నానబెట్టి నేరుగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
* హైబిపితో బాధపడుతున్నట్లైతే వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపి క్రమంగా అదుపులోకి వస్తుంది.
4. గుమ్మడికాయ విత్తనాలు
* గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, కోలన్ క్యాన్సర్లు రాకుండా ఉంటుంది.
* మహిళలు గుమ్మడికాయ విత్తనాలను తరచూ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ
* గుమ్మడికాయ విత్తనాలుహైబీపీని తగ్గిస్తాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
* మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
* వీటిల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సౌందర్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాంతివంతంగా, మృదువుగా కూడా మారుతుంది.
* తల వెంట్రుకలు రాలిపోవటం, చిన్నతనంలోనే బట్ట తల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వాటిల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఫలితంగా హెయిర్‌ఫాల్ కూడా తగ్గుతుంది.
5. బాదంపప్పుః
*ఇవి చాలా రకాల విటమిన్లను కలిగి ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి… స్లిమ్‌గా తయారవుతాం.
* శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుంది.
* జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధ్రుడంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే… జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B… బాదంపప్పుల్లో ఉంటుంది.
* బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది.
* జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే… మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. ఎందుకంటే… వాటిలోని మాంగనీస్… కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ E చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజూ బాదం పప్పులు తినేవాళ్లకు త్వరగా ముసలితనం రాదు.