నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. * 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. * వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. * జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. * ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Read More »తినగానే నీళ్లు తాగుతున్నరా..?
భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి? తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది. వెంటనే నీళ్లు …
Read More »జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..?
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. చుండ్రు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే.. జుట్టులో అసలైన మెరుపు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి… బౌల్‌లో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. జుట్టు ఎక్కువగా ఉంటే తగిన పరిమాణంలో మిక్స్ చేసుకోవాలి. జుట్టుమీద మసాజ్ చేసినట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే …
Read More »అద్దెగర్భంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
దాతల వీర్యంతో సరగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా బిడ్డలను పొందేందుకు 12 జంటలకు ప్రత్యేక అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును వెలువరించింది. 2023 మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చిన అద్దెగర్భం చట్టంలోని సవరించిన నిబంధనల ప్రకారం.. సంతానం లేని దంపతులు దాతల బీజకణాల ద్వారా సరగసీ విధానంలో పిల్లలను కనే అవకాశం లేదు. సరగసీకి ఆ జంట తమ బీజకణాలను (భార్య అండం, భర్త వీర్యకణాలను) మాత్రమే …
Read More »కోవిడ్ టీకాలకు… గుండె పోటుకు సంబంధం ఉందా..? లేదా..?
కరోనా విజృంభణ తర్వాత అత్యధికులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. అయితే కోవిడ్ కు గుండెపోటుకు ఏమైన సంబంధం ఉందా..?. లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము..?. దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న కోవిషీల్డ్ ,కోవ్యాక్సిన్ టీకాలకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. భారత్ లో ఆ టీకాలు చాలా సురక్షితమని వివరించారు. తాము జరిపిన పరిశోధనల్లో భాగంగా …
Read More »గురకతో గుండెకు ప్రమాదమా..?
సహజంగా నిద్రలో గురక మాములే. కానీ గురక వల్ల గుండెకు ప్రమాదమా కాదా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మధ్య వయసు దాటాక స్ట్రోక్ గుండెపోటు తప్పదని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికా దేశ వ్యాప్తంగా ఇరవై నుండియాబై ఏండ్ల మధ్య ఉన్న దాదాపు ఏడు లక్షల అరవై ఆరు వేల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. గురకపెట్టే యువకులకు మధ్య …
Read More »గుండె పోటు లక్షణాలు ఇవే..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ గుండెపోటుతో వచ్చే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అసలు గుండె పోటు వచ్చే ముందు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని USలోని స్మిడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధన తెలిపింది. ఆడవారిలో గుండెపోటుకు ముందు శ్వాస అందకపోవడం, మగవారిలో ఛాతీనొప్పి వస్తుందని పేర్కొంది. అలాగే గుండెదడ, మూర్ఛ, ఫ్లూ మాదిరి లక్షణాలు, ఉన్నఫళంగా చూపు మసకబారడం వంటివి కూడా సంకేతాలని …
Read More »వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే..?
మన వెంట్రుకలకు సహాజంగానే వానకాలం శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే. వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి …
Read More »మొక్క జొన్న ఎవరైనా తినొచ్చా..?
సహజంగానే మొక్కజొన్న శక్తికి చిరునామా. తక్షణ శక్తికి మంచి ఎంపిక. ఇందులో విటమిన్- ఎ, బి, ఇ, కె లాంటి విటమిన్లతోపాటు.. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. తక్కువ స్థాయిలో కొవ్వులూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా తినొచ్చు. కాకపోతే, ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే. అందుకే మధుమేహులు దూరంగా ఉండాలంటారు. అలా అని, అసలు తినకూడదని కాదు, తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. …
Read More »